నేడు పెద్దవాగు ప్రాజెక్ట్ ను పరిశీలించనున్న మంత్రి తుమ్మల 

నవతెలంగాణ – అశ్వారావుపేట
సామర్ధ్యానికి మించి వర్షపు నీరు చేరడంతో గత మూడురోజుల క్రితం గండి పడి కట్ట కొట్టుకు పోయిన మండలంలోని పెద్దవాగు ప్రాజెక్ట్ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం సందర్శించనున్నారు. ప్రాజెక్ట్ ఆనకట్ట గండ్లు పరిశీలన తో పాటు నీటి పారుదల శాఖ అధికారులతో మరమ్మత్తు  పనులు పై కార్యాచరణ చేపట్టే అవకాశం ఉంది. అనంతరం పంట నష్టపోయిన భూములను పరిశీలించి రైతులను పరామర్శ చేయనున్నారు
Spread the love