మైనర్లకు వాహనాలు నడపడానికి ఇస్తే జైలుకే వాహన రిజిస్ట్రేషన్ రద్దు 

నవతెలంగాణ కంఠేశ్వర్ 
మైనర్లకు వాహనాలు నడపడానికి ఇస్తే ఇక జైలు తప్పదని, వాహనాలు ఇస్తే వాహన రిజిస్ట్రేషన్ లను రద్దు చేస్తామని ఇకనుండి రోజు జిల్లాలో మైనర్ స్పెషల్ డ్రైవ్ నడుస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బుధవారం వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలియజేయునది ఏమనగా, ఇప్పటివరకు మైనర్లు వాహనాలు నడుతూ పట్టుబడితే, పోలీసు వారే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి జరిమానాలు వేసేవారు, మైనర్ డ్రైవింగ్ ను అరికట్టేందుకు, ఇకపై మైనర్లు వాహనం తీసుకుని రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ నగర పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుచన్నవి, ఇకముందు నుండి ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేస్తు దొరికితే, అట్టి మైనర్ ను మరియు తల్లిదండ్రులు లేదా యజమాని ఎవరైనా ఎం వి యాక్ట్-2019 అమెండ్మెంట్ సెక్షన్ 199-ఏ ప్రకారము, సంబంధిత కోర్టులలో హాజరుపరచబడును, వాహన యజమానికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 25 వేల రూపాయల వరకు జరిమానా విధించబడుతారు. మైనర్ల పట్టుబడిన వారికి 25 సంవత్సారాల వయస్సు నిండినంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ కు అర్హడు కాడు, అట్టి వాహనం యొక్క రిజిస్ట్రేషను 1 సంవత్సారం వరకు రద్దు చేస్తామని తెలిపారు.కావున ఎవరు కూడా మైనర్లకు వాహనాలు నడపడానికి ఇవ్వరాదని తెలియజేశారు.
Spread the love