Thursday, June 18, 2026
E-PAPER
Homeఆదిలాబాద్కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ-సిర్పూర్ (టి)
రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని రైతు వేదికల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మండలానికి చెందిన 72 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లల పెళ్లిళ్ల సమయంలో కుటుంబాలపై పడే ఆర్థిక భారం తగ్గించేందుకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాల ప్రయోజనాలను పొందాలని సూచించారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి వద్దకే తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, ఆర్‌ఐ ప్రవీణ్, సీనియర్ అసిస్టెంట్ వేణు, సర్పంచులు వొడ్డేటి నాగమణి-నానయ్య, రేచర్ల రజినీ-మహేష్, ఛత్రు నాయక్, యోగిదాస్, రాందాస్, తాను భాయ్, ఉప సర్పంచులు దుర్గం ప్రశాంత్, శేఖర్, మోహన్, వార్డు సభ్యులు బనర్కర్ సాయి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -