ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే జారే..

నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఎమ్మెల్యేగా మొదటి సారి తన పట్టభద్రులు ఓటును వరంగల్ – నల్గొండ – ఖమ్మం పట్టభద్రుల నియోజక వర్గం 2024 ఉప ఎన్నికలో సోమవారం నిర్వహించిన పోలింగ్ లో వినియోగించుకున్నారు. మండల కేంద్రం అయిన దమ్మపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం ఆయన ఓటు వేసారు. అశ్వారావుపేట నియోజక వర్గం మొదటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే కూడా జారే ఆదినారాయణ కావడం గర్వించదగ్గ విషయం.ఈయన ఎం.ఎస్సీ(మేథ్స్ ) లో పట్టభద్రులు కావడం విశేషం. మొదటి ఎమ్మెల్యే వగ్గెల మిత్ర సేన 10 వ,తరగతి,రెండో ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఓల్డ్ ఎస్.ఎస్.సీ,మూడూ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు 7 వ, తరగతి చదివినట్లు వీరు గత ఎన్నికల్లో నామినేషన్ లో సమర్పించిన అఫిడవిట్ లు ఆధారంగా తెలుస్తుంది. దీంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేగా జారే ఆదినారాయణ నమోదు అయ్యారు.
Spread the love