రైతులకు బాసటగా తెలంగాణ ప్రభుత్వం-ఎమ్మెల్యే పైళ్ల

నవతెలంగాణ-వలిగొండ: ఆదివారం సంగెం, వర్కట్ పల్లి, గోకారం, జాలుకాల్వ , నెమలి కాల్వ, గొల్నేపల్లి, నాగారం, లింగరాజు పల్లి గ్రామాలలో సోమవారం లోతుకుంట, నరసాయగూడెం, అరూర్, గురునాథ్ పల్లి, వెంకటాపురం, వేములకొండ, ముద్దాపురం, చిత్తపురం, గోపారాజు పల్లి గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డుషోలలో  మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓట్లు వేసేటప్పుడు ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని,ప్రతి పక్షాలు వారు చెప్పే కళ్ళ బొల్లి మాటలను నమ్మొద్దని, తెలంగాణ సమయంలో సబ్బండ వర్గాల ప్రజల అభువృద్ధికై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని, సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం 24 గంటల విద్యుత్, రైతు బంధు, రాయితీ భీమా లాంటి పథకాలు అందజేస్తూ రైతులకు బాసటగా నిలిచాట రని, గత ప్రభుత్వాల పాలనలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పాలయ్యేవారని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మద్దతు ధరతో పాటు ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆందిస్తుందని, ప్రతి గ్రామంలో సిసి రోడ్లు, అండర్ డ్రైనేజీలు, పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ, షాదిముభారక్,వృద్దులకు ఆసరా పథకం, ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి దేశానికే ఆదర్శనంగా నిలిచిన ముఖ్యమంత్రిగా పెరు దక్కిందని ఆయన అన్నారు. ప్రతిపక్షాల నాయకులు చెప్పే మాటలు నమ్మి  ఆగం కావద్దని ఓటర్లకు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు అత్యధిక ఓట్లు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం గోళ్లేపెళ్లి లో వివిధ గ్రామంలో వివిధ పార్టీల నుండి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.  ఈ కార్యక్రమంలో కొలుపుల అమరేందర్,ఫైళ్ల రాజ వర్ధన్ రెడ్డి, వంగాల వెంకన్న, సురకంటి వెంకట్ రెడ్డి, పనుమటి మమత నరేందర్ రెడ్డి,తుమ్మల వెంకట్ రెడ్డి, ముద్దసాని కిరణ్ రెడ్డి, మొగుళ్ల శ్రీనివాస్, కునపురి కవిత, చిట్టెడి జనార్దన్ రెడ్డి, గూడూరు శివశాంత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సామ రాం రెడ్డి, కీసరి రాం రెడ్డి, కీసర్ల సత్తి రెడ్డి, చిట్టెడి వెంకట్ రాం రెడ్డి, మర్రి వెంకటేశం, కోడితాల నాగరాజు, ఆవుల నర్సింహ, సోలిపురం సాగర్ రెడ్డి, మాద శంకర్, తుమ్మల సంతోష్, బోడ లక్ష్మీ బాలయ్య, ఆకుల వెంకన్న వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love