పార్టీ శ్రేణుల మధ్య పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి 

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
హైదరాబాద్ లోని స్వగృహంలో శుక్రవారం తన పుట్టినరోజు వేడుకలను మాజీ మంత్రి, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఘనంగా జరుపుకున్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేకును కట్ చేశారు.ఈ సందర్భంగా ఆయనకు బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల నుండి తరలి వెళ్లిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ప్రజా ప్రతినిధులు పుష్పగుచ్చాలను అందించి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా నియోజకవర్గం నుండి తరలివచ్చిన పార్టీ శ్రేణులతో మంత్రి స్వగృహం కిటకిట లాడింది. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు తరలివచ్చిన పార్టీ శ్రేణులకు, నాయకులకు, అభిమానులకు ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారితో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొని బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Spread the love