సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

నవతెలంగాణ – జుక్కల్
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శుక్రవారం నిర్వహించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని. అధికారులు, డాక్టర్లు అందరూ సమన్వయంతో పని చేసుకుంటూ వ్యాధులను అరికట్టాలని సూచించారు.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్యాన్ని అందించాలని చెప్పారు.. ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు..  వైద్యుల కొరత ఉన్న ఆసుపత్రులలో నియామకాలు చేపడతమన్నారు. అంబులెన్సు సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెలే తో పాటు  వైద్యశాఖ అధికారులు,  సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

Spread the love