ఎండకాలంలో నీటీ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టండి: ఎమ్మెల్యే

నవతెలంగాణ – జుక్కల్
రాబోయే ఎండకాలంలో నియేాజక వర్గంలోని గ్రామాలలో ఎక్కడా నీటీ కొరత సమస్యలు లేకుండా ముందస్తు గా సమస్యలను గుర్తించి చర్యలు వెంటనే చేపట్టాలని జుక్కల్  ఎమ్మెలే తోట లక్ష్మీకాంతారావ్ మీషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు    మండల కేంద్రంలోని ఎమ్మెలే క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ,, గ్రామీణ త్రాగు నీటీ పారుదల శాఖ అధికారులు  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యేే లక్ష్మీకాంతారావు సంభందిత శాఖ నాయకులతో  ఎండకాలంలో నీటీ సమస్య పైన సమీక్షా సమావేశం నిర్వహించారు. మారుముల జుక్కల్ నియేాజక వర్గం వెనుకబడి పొయిందనే ఉద్దేశంలో సమస్యల పరిష్కరించేందుకు అందరి సహకారంతో పరిష్కరింంచాలని ఆదేశించారు.

ప్రజా సమస్యల పైన గరఖాస్తుల స్వీకరణ :  మండలంలోని గ్రామాలలో ఉన్న సమస్యలను తన దృష్టికి రావాలని , వెంటనే పరిష్క రించేవిధంగా చర్యలు  చేపడుతామని ఎమ్మేలే లక్ష్మీకాంతారావ్ తెలిపారు. సమస్యల పైన ప్రజలు దరఖాస్తులను ఎమ్మెలే కు అందించారు. ప్రజల వినతులను స్వీకరించడం జర్గింది. కార్యక్రమంలో మిషన్ భగీరథ అధికారులు తదితరులు పాల్గోన్నారు.
Spread the love