కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసన

– మన హక్కుల సాధన కొరకై ఉద్యమిద్దాం రండి, తరలి రండి
నవతెలంగాణ – కంటేశ్వర్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా మన హక్కుల సాధన కొరకై ఉద్యమిద్దరం రండి తరలి రండి అని ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపులో భాగంగా విజయవంతం చేశారు. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్  ఫెడరేషన్ (అఖిలభారత ఉద్యోగ సమైక్య)  పిలుపు మేరకు  జాతీయఉపాధ్యక్షులు,  టీఎన్జీవోఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్  ఆదేశంతో, టీఎన్జీవో యూనియన్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో, ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్  అధ్యక్షతన, తేదీ:16-02-2024(శుక్రవారం) మ.1 గం.కు భోజన విరామ సమయంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడిఓసి) ముందు భోజన విరామ నిరసన కార్యక్రమాలు,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులప్రధాన సమస్యలు సీపీఎస్ రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని పునరిద్ధరించుట, ఇన్కమ్ టాక్స్ పరిమితిని 10 లక్షలకు పెంచుట,  ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయుట, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయుట ఇతర డిమాండ్ల సాధనకై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున టీఎన్జీవో అన్ని యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని శాఖల ఫోరం అధ్యక్ష కార్యవర్గ సభ్యులు, క్లాస్ ఫోర్& డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు,మహిళా ఉద్యోగ సోదరీమణులు, అన్ని శాఖల టిఎన్జీవో ప్రాథమిక సభ్యులు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సకాలంలో  విచ్చేసి నిరసన కార్యక్రమంలో పాల్గొని మన హక్కుల సాధన కొరకు కలిసికట్టుగా ఉద్యమిద్దాం నేతికుంట శేఖర్, జిల్లా కార్యదర్శి, టిఎన్జీవో జిల్లా సంఘం, నిజామాబాద్ తెలియజేసి విజయవంతం చేశారు.
Spread the love