రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

– బీఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్
నవతెలంగాణ – కంటేశ్వర్
మోదీ నాయకత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆధిపత్య ఆర్థిక విధానాల వల్ల లక్షలాది పరిశ్రమలు మూతపడి, కోట్లాదిమంది బహుజన కార్మిక వర్గం రోడ్డున పడిందన రైతులు, కార్మికులు, ఉద్యోగులు కొనుగోలు శక్తిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 16న రైతు, కార్మిక దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్ కు మద్దతుగా శుక్రవారం బహుజన వామపక్ష కార్మిక సంఘాల సమాఖ్య బి ఎల్ టి యు  జిల్లా కమిటి ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది గంటలకు  సుభాష్ నగర్ నుండి మున్సిపల్ కార్పొరేషన్ వరకు బైక్  ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రదర్శన కోర్టు నుండి ఖలీల్ వాడి మీదుగా బస్టాండ్ రైల్వే స్టేషన్ పాత మున్సిపల్  కార్పొరేషన్ కార్యాలయం  వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిల్లీ చూట్టూ రైతులు ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే వారి సమస్య పరిష్కారం చేయకపోగా దేశానికి అన్నం పెట్టే రైతులపై డ్రోన్లతో టీయర్ గ్యాస్ ద్వారా దాడి చేయడం సిగ్గుచేటన్నారు.రాబోయె రోజుల్లో కార్మిక వర్గం ప్రతిఘటించకపోతే  భారత రాజ్యాంగం కల్పించిన సామాజిక భద్రత, సంక్షేమం, రిజర్వేషన్లను బిజెపి కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే ప్రమాదం ఉందని బహుజన  లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బి ఎల్ టి యు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ హెచ్చరించారు.ఆదాని, అంబానీల కార్పోరేట్ కంపెనీలకు ఊడిగం చేసేలా కేంద్ర ప్రభుత్వం చట్టాలను సవరించే ప్రయత్నం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బిఎల్ టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. సిద్దిరాములు మాట్లాడుతూ.. బిజెపి కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న క్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు .బీడీ  పరిశ్రమపై విధించి జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు.బహుజన  లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత మాట్లాడుతూ బిజెపి కేంద్ర ప్రభుత్వం బహుజన శ్రామిక మహిళలకు కనీస వేతనాలు అమలు చేయకుండా శ్రమ దోపిడి చేసే పెట్టుబడిదారులకు అండగా ఉంటుందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో బిఎల్ టియు జిల్లా అధ్యక్షులు కె.మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ బియాల్టియు నాయకులు, జి.యాదయ్య,‌ మురళి , శ్రీశైలం, రాజేందర్, ప్రశాంత్, బి. ప్రసాద్, కె.సహాదేవ్, బిడిఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ జి.శ్రీమాన్,బహుజన లెఫ్ట్ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గీతాంజలి, ప్రధాన కార్యదర్శి దండు జ్యోతి, విద్యా, విజయ, రజిత తదితరులు పాల్గొన్నారు.
Spread the love