– త్వరలోనే మన ఇసుక మన ఊరు ద్వారా ఇసుక సరఫరా చేస్తాం
– విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
నవతెలంగాణ – అచ్చంపేట
దుందుభి నది నుంచి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రజలు ఇంటి నిర్మాణం కోసం అదే విధంగా అభివృద్ధి పనుల కోసం ఇసుక సరఫరా కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ ద్వారా బుకింగ్లు చేస్తున్నామని తెలిపారు. ఇసుక అవసరం ఉన్న ప్రజలు నేరుగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా దుందుభి నదిలో రెండు ఇసుక రీచరులను గుర్తించి , ఏజెన్సీ ద్వారా మాత్రమే తక్కువ ధరకు ప్రజల శ్రేయస్ కోసం సరఫరా చేస్తున్నామన్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక దుర్విని అందు నుంచి అచ్చంపేటకు 2500 నుంచి 3000 రూపాయలకు మాత్రమే సరఫరా చేయడం జరుగుతుందన్నారు. దూర ప్రాంతాలకు ₹3,500 నుంచి 4000 రూపాయలకు సరఫరా చేస్తామన్నారు. అక్రమ ఇసుక రవణకు సొంత పార్టీ కార్యకర్తలు ప్రయత్నించిన సహకరించేది లేదని హెచ్చరించారు. పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేద ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారంగా ఆరు గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేయడానికి ప్రణాళిక పద్ధతి రూపంలో అమలు చేస్తామని తెలిపారు. విలేకరుల సమావేశంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ హరిచంద్ర సీనియర్ నాయకులు డాక్టర్ మోపతయ్య తదితరులు ఉన్నారు.