అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

నవతెలంగాణ-నార్సింగి
మండల పరిధిలోని గ్రామాలైన నర్సంపల్లి, పెద్ద తాండా గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాళేశ్వరానికి సంబంధించిన కాలువల పనులు అసంపూర్తిగా ఉన్నాయని, చేగుంట, నార్సింగి మండలాలతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో కాలువలను పూర్తి చేయడానికి మంత్రిని కలిసి నివేదించినట్లుగా ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి మిగిలిన కాలువలను పూర్తి చేసి కాళేశ్వరం నీళ్లను కాలువల ద్వారా మళ్లించి పంటలు పుష్కలంగా పండే విధంగా కషి చేయనున్నట్లు పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలు మెదక్‌ ఎంపీగా ఉన్నప్పటికీ దుబ్బాక అభివద్ధి కొరకు ఒక ఎమ్మెల్యేగా పని చేశానని, ఆ అనుభవం తనకు ఇప్పుడు పనికి వస్తుందన్నారు. దుబ్బాకను అన్ని విధాలుగా అభివద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. నర్సంపల్లి గ్రామంలో రూ.4.5 లక్షలతో అంగన్వాడి భవన నిర్మాణం, రూ.17 లక్షలతో పల్లె దవాఖాన, రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, రూ.5 లక్షలతో మహిళా సంఘ భవనం, రూ.5 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే ప్రభాకర్‌ రెడ్డి వాటిని ప్రారంభించారు. అనంతరం పెద్ద తండాలో మన ఊరు మనబడి పథకం కింద రూ.23 లక్షలతో పాఠశాల ప్రహరీ, రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, రూ.4.5 లక్షలతో కమ్యూనిటీ హాల్‌ను ప్రభాకర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ స్థానిక జెడ్పీటీసీ బాణాపురం కష్ణారెడ్డి, సీడీపీఓ స్వరూప, ఎంపీపీ చిందం సబితా రవీందర్‌, పెద్ద తండా సర్పంచ్‌ క్షత్రియ నాయక్‌, నర్సంపల్లి సర్పంచ్‌ భారతి సత్తయ్య, బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు మైలారం బాబు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మైలారం సత్యనారాయణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు విష్ణు వర్ధన్‌ రెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షులు లాలం, బాషా నాయక్‌, ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేష్‌, నార్సింగి సొసైటీ చైర్మన్‌ శంకర్‌ గౌడ్‌, సీనియర్‌ నాయకుడు శ్రీపతి రావు, ఐకెపీ ఎపీఎం అశోక్‌, ఐకేపీ సిసి సుల్తానా, రమేష్‌లతో పాటు ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Spread the love