నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెలే లక్ష్మీకాంతారావ్ ప్రజల నుండి ఫిర్యాదులు మంగళవారంనాడ తీసుకోవడం జరిగింది. ఈ సంధర్భంగా వివిధ మండలాలు ,గ్రామాల నుండి ప్రజలు తమ వ్యక్తి గత సమస్యలతో పాటు గ్రామానికి చెందిన సమస్యలు ఎమ్మెలే దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని సమస్యలను ఎమ్మెలే తోట లక్ష్మీకాంతారావ్ అధికారులతో చరవాణిలో మాట్లాడి పరిష్కరించడం తో ప్రజలు సంతోషం వ్యక్తం చేసారు. మిగత వారికి కూడా మాట్లాడి, పని పరిష్కరిస్తానని హమీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెలే లక్ష్మీకాంతారావ్ మాట్లాడుతు ప్రజలకు సమస్య ఉంటే నేరుగా తనకు కలిసి తెలుపాలని , తన పరిదిలోనిది ఉంటే తప్పక పరిష్కరిస్తానని వచ్చిన ప్రజలకు తెలియచేసారు. ఆయన వెంట మండల కాంగ్రేస్ పార్టీ నాయకులు వినోద్, రమేష్ దేశాయి, తదితరులు ఉన్నారు.