మండలంలో రేపు ఎమ్మెల్యే పర్యటన..

నవతెలంగాణ – తొగుట
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శనివారం తొగుట మండలంలో పర్యటించనున్నారని మండ ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి తెలిపారు. శుక్రవారం పత్రిక ప్రకటన తెలిపిన సమాచారం ప్రకారం ఉదయం 11 గంటలకు ఎంపీ డీఓ కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబా రక్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం ఘనపూర్ లో గౌడ సంఘం, ఎల్లారెడ్డిపేటలో ముది రాజ్ సంఘం కమ్యూనిటీ భవనాలను, జప్తిలింగా రెడ్డి పల్లి లో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించనున్నా రు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, బీఆర్ఎస్ గ్రామ, బూత్, యూత్, విద్యార్థి, సోషల్ మీడియా ప్రతి నిధులు, బీఆర్ఎస్ నాయకులు హాజరై విజయ వంతం చేయాలని ఆయన కోరారు.
Spread the love