– ప్రజల్లో ఉద్యమ నాయకుడిగా మహేందర్ రెడ్డికి గుర్తింపు
నవతెలంగాణ సిరిసిల్ల
పట్టభద్రుల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వెలువడగా కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి కి టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన ఒప్పుకుంటే మాత్రం తప్పకుండా అధిష్టానం అతనికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది ఈ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ టికెట్ కోసం ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ ప్రజల్లో ఉద్యమ నాయకుడిగా మహేందర్ రెడ్డి కి గుర్తింపు ఉండటంతో అతనికి ఈ టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మహేందర్ రెడ్డి కొద్దిరోజుల క్రితం అమెరికా వెళ్ళగా ఆయన వచ్చిన తర్వాత అధిష్టానం అతన్ని పిలిచి టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పేర్కొన్నారు అలాగే టిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ లేదా టీఎన్జీవోస్ మాజీ అధ్యక్షులు బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి శ్రీ ప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నరేందర్ రెడ్డి కి టికెట్ ఇవ్వకపోతే అతనికి టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి బిజెపి నుంచి గుజ్జుల రామకృష్ణారెడ్డి రాణీ రుద్రమ రెడ్డి ల పేర్లను పరిశీలిస్తున్నారు అంతేకాకుండా ఎక్కువ సంఖ్యలో ఈసారి స్వతంత్రులు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి కేకే మహేందర్ రెడ్డి కి ఈ ప్రాంత పట్టభద్రులతో సంబంధాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి అంతేకాకుండా పార్టీ అధికారంలో ఉండటంతో పాటు అనేక ఉద్యోగ ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేస్తుండడంతో కాంగ్రెస్ పై నిరుద్యోగులకు కొంత నమ్మకం పెరిగిందని చెప్పుకోవచ్చు