నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎలుకలు కరిచి కాళ్లు చచ్చుబడిపోయిన బీసీ గురుకుల విద్యార్థినికి మెరుగైన వైద్యమందించాలని బీఆర్‌ఎస్ సభ్యులు తాతా మధు కోరారు. బుధవారం శాసనమండలిలో ఈ మేరకు ప్రత్యేక ప్రస్తావన చేశారు. ఆమె తల్లి కూలి చేసుకుని బతుకుతున్నదనీ, ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. ఇతర పాఠశాలల్లోనూ ఇలాంటివి జరగకుండా చూడాలన్నారు. కనీస వేతనాల జీవోను సవరించాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, జీవో 29తో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు అన్యాయం జరుగుతున్నందున, గతంలో ఉన్న జీవో 55ను వర్తింపజేయాలని కోరారు.