పీఆర్టియుటీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు

MLC voter registration under PRTUTSనవతెలంగాణ – ధర్మారం 
మండల పీఆర్టియుటీఎస్ అధ్యక్షులు జాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్క ఉపాధ్యాయులు, గ్రాడ్యూయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరుతూ మండల పరిధిలోని అన్ని పాఠశాలల్లో నమోదు దరఖాస్తులను అందించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయు పీఆర్టీయూటీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి కి  మొదటి ప్రాధాన్యత ఓటేసి  గెలిపించాలని కోరారు‌. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్, జిల్లాఉపాధ్యక్షులు దేవి రమేష్, పి ఆర్ టి యు జిల్లా నాయకులు కోట శశిధర్, ముద్దసాని సతీష్ అయా పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love