వ్యవసాయశాఖాధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం..

నవతెలంగాణ  –  జుక్కల్
ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వ్యవసాయ శాఖపై   జుక్కల్ శాసన సభ్యులు తోట లక్ష్మీ కాంతారావు గారు  వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం శుక్రవారం  నిర్వహించారు. ఈ సందర్బంగా నియోజక వర్గంలో మండలాల వారిగా ప్రస్తుత సీజన్ కు సంబంధించి రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాల వివరాలు మరియు అందుబాటులో ఉన్న ఎరువులు మరియు విత్తనాల వివరాలను  అధికారులను అడిగి తెలుసుకున్నారు.రైతులకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ  ఎరువులు, విత్తనాల కొరత రాకుండా నాణ్యమైన విత్తనాలను సరఫారా అయ్యేలా చూడాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు విక్రయించే దుకాణాలు మరియు వ్యాపారస్థులపై  కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు..ప్రభుత్వం రైతులకు ఇస్తున్న రైతు భరోసా, రైతు భీమా, రుణమాఫీ వంటి పథకాలను అర్హులైన లబ్ది దారులకు చేకూర్చేలా కృషి చేయాలన్నారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెలే తో పాటు వ్వవసాయాదీకారులు, ఏఈవోలు తదితరులు పాల్గోన్నారు.

Spread the love