ఎంఎంటీఎస్ – ఆర్టీసీ కంబైన్డ్‌ పాస్‌ రూ.1,350

MMTS-RTCన‌వ‌తెలంగాణ – హైదరాబాద్‌: జంటనగరాల ప్రయాణికులకు ఎంఎంటీఎస్-ఆర్టీసీ కంబైన్డ్‌ బస్‌పాస్‏ను దక్షిణ మధ్యరైల్వే పునరుద్ధరించింది. అటు ఎంఎంటీఎస్‌ రైళ్లల్లో ఇటు టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణించేందుకు వీలుగా కంబైన్డ్‌ బస్‌పా్‌సను రైల్వే, ఆర్టీసీ సంస్థలు సంయుక్తంగా ప్రవేశపెట్టాయి. గతంలో ఉన్న కంబైన్డ్‌ పాస్‌ ధర(రూ.1,050)ను ఇటీవల రూ.1,350కు పెంచారు. కంబైన్డ్‌ బస్‌పాస్‏ను జంటనగరాల్లోని అన్ని ఎంఎంటీఎస్‌ స్టేషన్ల(టికెట్‌ కౌంటర్ల)లో జారీచేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ కంబైన్డ్‌ పాస్‌ ఎంతో ప్రయోజనకరంగా ఉందని ఎంఎంటీఎస్‌ ప్రయాణికుల సంఘం ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love