రైతులకు ఇచ్చిన హామీలను కేంద్రం వెంటనే అమలు చేయాలని రాజబాబు నేత యూత్ కాంగ్రెస్, రాష్ట్ర యువజన నాయకులుఅన్నారు.రైతులు కిసాన్ మోర్చా తల పెట్టిన చలో ఢిల్లీ 2.0 ని అణచి వేస్తున్న మోడీ సర్కార్ ఆ నాడు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయని బీజేపీ ప్రభుత్వం 2020 లో మోడీ సర్కార్ మూడు నూతన వ్యవసాయ చట్టాలను తెచ్చింది. అవి కాంట్రాక్టు వ్యవసాయ ఒప్పంద వ్యవసాయ)చట్టం2020. పంటను ఎక్కడ అయినా అమ్ముకునే స్వేచ్చ యుత మార్కెట్ బిల్ 2020 వన్ నేషనల్ వన్ మార్కెట్, నిత్య అవసర సరుకుల సవరణ చట్టం.2020(అసెంటిల్ కామడిటీస్ ఆమెండమెంట్ అక్ట్ వీటిలో ఉన్న వివిధ లోపాలను గుర్తించిన రైతులు వీటిని వ్యతిరేకిస్తూచలో ఢిల్లీ కి పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఎంత అణచి వేయాలి అని ప్రయత్నం చేసిన రైతులు ఆగస్టు 9 -2020)-డిసెంబర్ 11(2021 వరకు దాదాపు. 16నెలల 2 రోజులు ఉద్యమం చేశారు.
వీర్ని అణచి వేసే ప్రయత్నం లో 750 మంది మరణించారు.ఒకవైపు కరోనా లాంటి విపత్కర పరిస్థితి లో కూడా వెనక్కి తగ్గలేదు. దీనితో కేంద్రం UP తో సహా బీజేపీ కి కీలక మైన అయిదు రాష్ట్రముల శాసన సభ ఎన్నికలకు రెండు నెలల ముందు డిసెంబర్ 11(2021). నాడు ప్రధాని మోడీ ఈ చట్టాలను రద్దు చేస్తునట్టు ప్రకటన చేశారు.మరియు రైతులను క్షమాపణ కోరుతూ వారి డిమాండ్లని పరిస్కరిస్తాం అని హామీ ఇచ్చారు. దాదాపు రెండు ఏండ్లు గడిచిన హామీలు అమలు చేయని మోడీ సర్కార్ దీనితో భారతీయ కిసాన్ మోర్చా చలో ఢిల్లీ 2.0 కి పిలుపునిస్తూ ప్రకటనచేశారు. దీనిని అడ్డుకోవడం కోసం అనేక ప్రయత్నలు చేసిన కేంద్రం.ఫిబ్రవరి 8 రైతులతో చర్చలు జరిపి విఫలం అయినా కేంద్రం.మళ్ళీ ఫిబ్రవరి 13 నా పోరాటలకు దిగుతాం అని ప్రకటన చేసిన కిసాన్ మోర్చా మరియు అనుబంధా సంఘాలు దీనితో ఫిబ్రవరి 12 నా కేంద్రం మంత్రులు పియిష్ గోయల్, అర్జున్ ముండా & నిత్య నంద రాయ్ చండిఘర్ లో రైతులతో అర్థ రాత్రి వరకు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి.దీనితో రైతులు ఢిల్లీ బాట పట్టారు.వీర్ని అణచి వేసేందుకు టియర్ గ్యాస్ ప్రయోగం.రోడ్ల పైన భారీ ముళ్ల కంచెలు ఏర్పాటు చేయడం, మేకులు కొట్టడం, బారికేడ్లు ఏర్పాటు చేసి అరెస్ట్ చేయడం లాఠీ ఛార్జి చేసి.. అన్ని రకాలుగా ఉక్కు పాదం మోపిన వారు ఢిల్లీ చేరకుండా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన వారు అన్ని దాటుకుని ఢిల్లీ చేరినారు.
ఇంతకీ వారి డిమాండ్లున్యాయపరమైనవా కాదా
ఒకసారి చూద్దాం. పంటల కనీస మద్దత్తు దరకి చట్ట బద్దత కలిపించాలి MSP చట్టం చేయడం. స్వామి నాధన్ సిపారస్సులము యాదవిధంగా అమలు చేయడం. రైతు రుణాలు మాఫీ చేయడం.
రైతులకు వ్యవసాయ కార్మికులకు పెన్షన్ ఇవ్వడం
రైతు ఉద్యమం లో చనిపోయినా రైతు కుటుంబంలకు పరిహారం ఇవ్వాలి.యూపీ లో లకీమ్ పూర్ కేరి ( 3అక్టోబర్ 2021)ఘటన బాధిలకు న్యాయం చేయాలి.
కేంద్ర సహాయక మంత్రి అజయ్ మిశ్ర కొడుకు ఆశీస్సు మిశ్రా ఉద్దేశ పూర్వకంగా రైతుల పైన కార్ SUV ఎక్కించాడు.దీనిలో ఒక జ ర్నలిస్ట్ నలుగురు రైతులు &నలుగురు ఇతరులు మరణించరు పది మంది గాయ పడ్డారు.వారికి ఉద్యోగం తో పాటు పది లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చారు.దీనిలో ఇప్పటికి ఆశీస్ మిశ్రా కి ఇప్పటికి ఎలాంటి శిక్ష పడలేదు. రైతుల పైన పెట్టిన కేసులన్ని ఎత్తివేయాలేదు. ప్రధాన డిమాండ్ మినిమం చట్టబద్ధత ప్రైస్ కల్పించాలని స్వామి నాధన్ ఫార్ముల MSP రైతుల పెట్టుబడి 50%) MSP=A2+C2+50 %అదనం ఫార్మర్స్ తక్కువ వడ్డీకి పెట్టుబడి రుణాలు ఇవ్వాలి కరువు విపత్తులు వస్తే రుణాల వసూలు వాయిదా వేయాలి. మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కలిపించాలి. అంతర్జాతీయ టెక్నాలజీ ని రైతులకు అందించాలి.
ఇవి స్వామి నాధన్ కమిటీ ప్రధాన అంశాలు
స్వామి నాధన్ భారత రత్న ప్రకటించిన ప్రభుత్వం వారి సూచనల్ని పాటించక పోతే వారిని అగౌరవ పరచడమే అవుతుంది.మోడీ సర్కార్ వెంటనే వారికి ఇచ్చిన హామీలను మరియు వారి డిమాండ్లను వెంటనే పరిస్కరించి వారికి న్యాయం చేయాలి.