– సీపీఐ(ఎం)ఎంపీ వి.శివదాసన్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోని యూనివర్శిటీ లు, కళాశాలల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోతో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలన్న యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రతిపాదన ఉపసం హరించుకోవాలని సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్ డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదన దేశంలోని ఉన్నత విద్యా రంగాన్ని అవమానించడమేనని అన్నారు. సంకుచిత రాజకీయ ప్రచారానికి విద్యార్థులను సాధనాలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. యూజీసీ వంటి ముఖ్య సంస్థల సారథ్యంలో ఇలాంటి ఉత్తర్వులిచ్చే వ్యక్తులుండడం దేశ ప్రయోజనాలకు మేలు చేయదని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వును ఉప సంహరించుకునేలా జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశారు.