Thursday, June 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

- Advertisement -

నవతెలంగాణ-అచ్చంపేట
పెంచిన పెట్రోల్, డీజిల్ వంటగ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ఎన్టీఆర్ స్టేడియం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ గాంధీ చౌరస్తాలో బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్, రాష్ట్ర అధ్యక్షులు శివ చరణ్ రెడ్డి చరణ్ రెడ్డి ముఖ్య అతిథులుగా వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తన కార్యకర్తలతో ఘనంగా వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మోడీ వీక్.. నీట్ పేపర్ లీక్.. అంటూ నినాదాలు చేశారు. దేశంలో పేద ప్రజలకు వసతులు సౌకర్యాలు కల్పించడంలో బిజెపి ప్రభుత్వ విఫలమైందన్నారు. పేద ప్రజల పథకాలకు నిధుల కోత విధిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్పోరేట్ శక్తులకు పనిచేస్తుందని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -