- Advertisement -
సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్
నవతెలంగాణ-కట్టంగూర్
ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్య బోధించడంతోపాటు విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పిస్తారని సర్పంచ్ శ్యామల శేఖర్ అన్నారు. మంగళవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. సమావేశంలో మండల విద్యాధికారి అంబటి అంజయ్య, ఉప సర్పంచ్ గుండు రాంబాబు, వార్డు సభ్యులు అయితగోని సైదమ్మ, బొమ్మ మహేష్, మండల సమాఖ్య అధ్యక్షురాలు అయితగోని ఝాన్సీ, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ దోరెపల్లి పద్మావతి, అంగన్వాడి టీచర్లు ఉన్నారు.
- Advertisement -



