– మోడీ చేతకానితనంతోనే నీట్ పేపర్ లీకేజ్
– యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్
నవతెలంగాణ – భువనగిరి
కేంద్ర బీజేపీ ప్రభుత్వ అసమర్థత ప్రధాని నరేంద్ర మోడీ చేతగానితనంతోనే నీట్ పరీక్ష పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మంగ ప్రవీణ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమవుతున్నారన్నారు.
డబుల్ ఇంజన్ సర్కారు అని చెప్పుకుంటూ డబుల్ టైం పేపర్ లీకేజీ చేస్తూ పూర్తిగా దేశ పాలనలు తుంగలో తొక్కి రాజకీయాలకు ప్రాధాన్యతమిస్తూ కక్ష సాధింపు చర్యలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కుల,మత విద్వేషాలను రెచ్చగొడుతూ దేశంలో అల్లా కల్లోలం సృష్టించాలనే లక్ష్యంతో పని చేస్తూ పరిపాలనలో విఫలమయ్యారన్నారు. ప్రశ్నించిన వారిపై మోడీ అమిత్ షాలు సిబిఐ ఈడిఐటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి, ఆలేరు అసెంబ్లీ అధ్యక్షులు బద్దం వాసుదేవ రెడ్డి, మంగ కిరణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడుమేకల మహేష్ యాదవ్, చేకూరి బాలు, బట్టు సందీప్, అసెంబ్లీ అధ్యక్షులు బొల్లెపల్లి వినయ్, జలీల్, అబేద్, జిల్లా యువ నాయకులు పోత్నూక్ సన్నీ, వరుణ్, జాలిగాం శివ, పాల్గొన్నారు



