కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సౌకర్యాలు కల్పించాలి: మహమ్మద్ షబ్బీర్ అలీ

నవతెలంగాణ-భిక్కనూర్
 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సరైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్  షబ్బీర్ అలీ తెలిపారు. భిక్కనూరు పట్టణంలో ప్రభుత్వ సలహాదారులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని విక్రయించిన వారం రోజుల్లో డబ్బులు వారి ఖాతాలో జమ అవుతాయని, కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలని దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్, ఏఎంసి చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ స్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, సొసైటీ చైర్మన్ భూమయ్య, నాయకులు గాల్ రెడ్డి, నరసింహారెడ్డి, లింబద్రి, మైపాల్ రెడ్డి, మోహన్ రెడ్డి, ఎమ్మార్వో శివ ప్రసాద్, ఏవో శోభ, వ్యవసాయ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love