బాధిత కుటుంబానికి మోహన్ రావు పటేల్ ట్రస్ట్ చేయూత 

Mohan Rao Patel Trust for the victim's familyనవతెలంగాణ – కుభీర్
ఇటీవల మండల కేంద్రానికి చెందిన బొడ్డు యశోద బాయి వ్యవసాయా క్షేత్రంలో పాము కాటు వేయడం తో మృతి చెందడం జరిగింది. దింతో విషయం తెలుసుకున్న మోహన్ రావు పటేల్ ఆయన ట్రస్ట్ ద్వారా శనివారం బాధిత కుటుంబానికి మోహన్ రావు పటేల్ పరామర్శించి ట్రస్ట్ ద్వారా రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్బంగా దురదృష్టవత్తుగా ఏదైనా కారణాల వల నష్టపోయిన నిరుపేద  కుటుంబానికి మోహన్ రావు పటేల్ ట్రస్ట్ ఎల్లపుడు ముందుతుందని అన్నారు. అదే విదంగా అదే గ్రామానికి చెందిన తోకల రమేష్ అనే యువకుడు బోను క్యాన్సర్ తో మృతి చెందడం తో వారి కుటుంబానికి పరామర్శించి వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వారి వెంట సుభాష్ పటేల్ పుప్పాల లింగం బొట్టు నారాయణ శేఖర్ విశ్వనాథ్ ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
Spread the love