మంచి మనస్సు చాటుకున్న మోపాల్ గ్రామ చిన్నారులు..

నవతెలంగాణ – మోపాల్
మంచి మనస్సు చాటుకున్న మోపాల్ గ్రామ చిన్నారులు  వేసవి కాలం వచ్చింది  పక్షులకు దాహం తీర్చి ప్రాణం కాపాడండి. ఎండలు ఎక్కువగా ఉన్నందువలన మనం ఇంట్లోనే ఉండలేక పోతున్నాం మరి పక్షులు గురించి ఆలోచించండి. ఎండాకాలం మొదలైంది గొంతు తడుపుకునెందుకు పక్షుల కోసం మీ ఇంటి బయట లేదా మీ ఇంటి అవరణలో కొన్ని నీళ్ళు, గుప్పెడు గింజలు పెట్టండి. చాలా పక్షులు నీళ్ళు దొరకక చచ్చిపోతున్నాయి. కావున దయచేసి మట్టి పాత్రలో ఇంటి అవర్ణలో నీళ్ళు మరియు గింజలు పెట్టి పక్షులను ప్రాణాలు కాపాడి స్వేచ్ఛ జీవితాన్ని ఇవ్వండి అని మొపాల్ గ్రామానికి చెందిన అంగలి నవీన్ రెడ్డి, జ్యోతి,చిన్నారులు అక్షర,ఆకృతి, హరిని ,హాస్య,కన్నయ్య ,లక్కీ పాల్గొన్నారు. చిన్నతనంలోని పెద్ద మనస్సుతో ఆలోచించి మిగతా పిల్లలకు వారు ఆదర్శంగా నిలుస్తున్నారు.  ఇటువంటి పిల్లలను ఆదర్శంగా తీసుకొని మిగతా వారందరూ కూడా తమ ఇంటి డాబా పైన కానీ, చుట్టుపక్కల గల పశువుల కోసమైనా సరే వాటి దాహార్తి తీర్చే విధంగా చూడాలని వారు తెలియజేస్తున్నారు.
Spread the love