మాతృదేవోభవ ఆశ్రమానికి ఎస్‌బీఐ సాయం

Mother Goddess SBI help to Ashram–  వాహనాన్ని అందించిన డీజీఎం రానా ఆశుతోష్‌
హైదరాబాద్‌ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా మరో ఎన్‌జీఓకు చేయూతనిచ్చింది. రంగారెడ్డి జిల్లా అల్మాస్‌గూడలోని మాతృదేవోభవ ఆనంద ఆశ్రమానికి బుధవారం టాటా వింగర్‌ వాహనాన్ని ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రానా అశుతోష్‌ కుమార్‌ సింగ్‌ అందజేశారు. 2018లో యాదయ్య ప్రారంభించిన ఈ లాభాపేక్షలేని సొసైటీలో వికలాంగులు, ఆసర లేని బలహీన వర్గాల వారికి ఆశ్రయం కల్పిస్తుంది. ప్రస్తుతం ఇందులో 120 మందికి షెల్టర్‌ కల్పిస్తున్నారు. 8-10 మంది ప్రయాణించగల ఈ వాహనాన్ని వైద్య, ఇతర సదుపాయాల సేవలకు ఉపయోగించనున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో ఎస్‌బిఐ ముందు వరుసలో ఉందని డిఎండి రానా అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బిఐ హైదరాబాద్‌ సర్కిల్‌ సిజిఎం రాజేష్‌ కుమార్‌, జిఎంలు మంజూ శర్మ, దేబాశిష్‌ మిశ్రా, విద్యా రాజా, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

Spread the love