నవతెలంగాణ-పెద్దవూర
తెలంగాణ రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్, నల్లగొండ జిల్లా కమిటీ మేరకు మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం గ్రామస్థాయిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేయుచున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను రక్షణమే చెల్లించాలని మండల ఫీల్డు అసిస్టెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంపిడీఓ సుధీర్ కుమార్ కు గురువారం వినతి పత్రం అంద జేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ఎఫ్ టీ ఈ లుగా కన్వర్ట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించి వంటి న్యాయమైన సమస్యలను పరిష్కరించి మా కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. గత 2006 నుండి 20ఏళ్ళు గా గ్రామ పంచాయతి పరిధిలో పంచాయతీ కార్యదర్శికి అసిస్టెంట్లుగా నియామకమైన మేము గ్రామాలలోని ఉ పాధి కూలీలకు నిత్యం అందుబాటులో ఉంటూ కేవలం ఉపాధి హామీ పనులనే కాకుండా ప్రభుత్వం చేపడుతున్న అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు చెపట్టామని అన్నారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత 2023 ఎన్నికల మేనిఫెస్టోలో మా ఫీల్డ్ అసిస్టెంట్లకు పేస్కేల్ వర్తింపచేస్తూ, వేతనాలు పెంచి, మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని వెంటనే అమలు చేయాలని కోరారు. ఉపాధి హామి హక్కుదారులైన కూలీలకు రోజూవారి వేతనం 400 రూపాయలకు పెంచుతూ ఒక ఆర్థిక సంవత్సరంలో 150 రోజుల పని దినాలు కల్పించడం,ఫీల్డ్ అసిస్టెంట్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హమీ మేరకు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ, పే స్కూల్ వర్తింపచేయాలి, జనవరి మాసం నుండి మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలను తక్షణమే చెల్లించాలి, ఉపాధి హామితో పనిచేయుచున్న మిగతా అన్ని స్థాయిల ఉద్యోగుల మాదిరిగానే మా ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా కనీసం వేతనం 25,000 రూపాయలు ఇవ్వాలి, ఫీల్డ్ అసిస్టెంట్లకు హెల్త్ కార్డులు ఇచ్చి విధి నిర్వహణలో మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబానికి 10 లక్షల ఎక్స్రేషియా ఇవ్వాలి. 4779 సర్క్యులర్ను రద్దు చేసి లిస్టు 3 క్రింద తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధులలోనికి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.