ప్రతి ఇంటి నల్లాల సర్వేను పకడ్బందిగా నిర్వహించాలి: ఎంపీడీఓ

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని ముప్పై గ్రామ పంచాయతి పరిదిలోని గ్రామాలలో నల్లాల సర్వే పకడ్బందిగా నిర్వహించాలని జుక్కల్ ఎంపీడీఓ శ్రీనివాస్ ఆర్డబ్ల్యుఎస్, జీపీ సెక్రటిలకు ఆదేశించారు. ఈ సంధర్భంగా  జుక్కల్ మండల కేంద్రంలోని కుమ్మరి వాడలో మిషన్ భగీరథ నల్లా నీరు సక్రమంగా వస్తున్నాయా?  విధిలో అందరికి మిషన్ భగీరథ నల్లాలు ఉన్నాయా? నీరువస్తుందా? ఇంకా ఎంతమందికి నల్లా కనెక్షన్ లు లేవు అన్న విషయాలను విధిలో ఇంటింటికి తిరిగి కాలనీ వాసులకు  క్షేత్రస్థాయిలో సర్వే జర్గుతున్న  వివరాలను బుదువారం నాడు  పరీశీలించారు. గ్రామాలలో ఉన్న వారికి ఇంటింటికి శుద్ద త్రాగునీరు అందించాలని, నల్లా కనెక్షన్ లేని వారికి కొత్త కనెక్షన్ ఇవ్వాలని జీపీ కార్యదర్శులకు ఎంపీడీఓ ఆదేశించారు.  ఆయనతో పాటు స్థానిక అధికారులు ఉన్నారు.
Spread the love