
కైతాపురం ఎల్లగిరి తుప్రాన్ పేట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టర్నమెంట్ ను చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి శనివారం విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి ధర్మోజిగూడెం వద్ద శనివారం ప్రారంభించారు.ఈ క్రికెట్ టోర్నమెంట్ కి ప్రథమ బహుమతి దాతగా తాడూరి వెంకట్ రెడ్డి రూ.60.000/ ద్వితీయ బహుమతి రిక్కల భాస్కర్ రెడ్డి రూ.30.000 షీల్డ్ దాత సంగం గ్రూప్ ఆఫ్ హోటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి స్పాన్సర్ చేశారు. ఈ సందర్భంగా తాడూరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలు శారీరికంగా మరియు మానసికంగా దోహదపడతాయని దీనివల్ల గ్రామాల మధ్య స్నేహభావం ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లగిరి కైతాపురం మాజీ సర్పంంచు లు రిక్కల ఇందిరసత్తిరెడ్డి గుడ్డేటి యాదయ్య టోర్నమెంట్ నిర్వాహకులు టీం యజమానులు మొహమ్మద్ ఇబ్రహీం,రిక్కల మహేందర్ రెడ్డి,వెల్మ రామలింగేశ్వర్ రెడ్డి,బాలగోని నరసింహ యాదవ్,మన్నే ప్రవీణ్ రెడ్డి,కందగట్ల జంగారెడ్డి, బక్కతట్ల శ్రీశైలం యాదవ్,బక్కతట్ల యాదగిరి యాదవ్,ఎల్లగిరి కైతాపురం తూప్రాన్ పేట్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వివిధ స్థాయి నాయకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.