బాయిలర్ పనులను తనిఖీ చేస్తున్న శ్రీ కాంత్ రెడ్డి

– గడువులోగా పనులు పూర్తి చేయాలి : ఆయిల్ ఫెడ్ పి అండ్ పి మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట
కార్యాచరణ ప్రకారం నిర్ణీత గడువులోగా బాయిలర్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆయిల్ఫెడ్ ప్లాంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి కాంట్రాక్టర్లను ఆదేశించారు.  నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని,పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్థానిక అధికారులకు సూచించారు. అశ్వారావుపేట,దమ్మపేట మండలం అప్పారావు పేట పామాయిల్ ఫ్యాక్టరీ లో జరుగుతున్న పనులను బుధవారం ఆయన తనిఖీ చేశారు.పనులు నిర్వాహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి సీజన్ ప్రారంభం కాబోతున్నందున క్రషింగ్ కు సిద్ధంగా ఉండాలని,రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అప్పారావు పేట ఫ్యాక్టరీ లో రూ.32 కోట్లతో చేపట్టిన వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ పవర్ ప్లాంట్,30 టన్నుల సామార్థ్యం విస్తరణ పనులు పూర్తి అయ్యాయని,రూ.30 కోట్లతో అశ్వారావుపేట ఫ్యాక్టరీ బాయిలర్ పనులు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. పనులకు సకాలంలో పూర్తి చేయాల్సిందిగా కాంట్రాక్టర్లకు నిర్దేశించి నట్లు చెప్పారు. ఆయన వెంట ఫ్యాక్టరీ మేనేజర్లు కళ్యాణ్,నాగబాబు,వెంకటేష్, పవన్,గోపాల క్రిష్ణ లు ఉన్నారు.
Spread the love