ముమ్మరంగా మిషన్ భగీరథ ట్యాప్ లు సర్వే..

– స్కీం జాబితాకు పంచాయితీ లెక్కలకు కుదరని పొంతన..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వం మారడంతో గతంలో ని పధకాలను సమీక్ష చేస్తున్నారు.ఇందులో భాగంగా మిషన్ భగీరథ స్కీం లో ఏ గ్రామంలో ఎన్ని ట్యాప్ లు ద్వారా సురక్షితమైన నీరు అందుతుంది అనే అంశాన్ని పరిశీలించడానికి గ్రామపంచాయితీ సిబ్బంది ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. మిషన్ భగీరథ ఇంట్రా విభాగం ఏఈ లక్ష్మి తెలిపిన వివరాలు ప్రకారం నియోజక వర్గం కేంద్రం అయిన మండలం లో మొత్తం గృహాలు 18124 ఉండగా మొత్తం 5242 ట్యాప్ లు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.అలాగే మండలంలోనే మేజర్ పంచాయితీ లో మొత్తం గృహాలు 3566 మిషన్ భగీరథ ట్యాప్ లు  మొత్తం 84 మాత్రమే ఉన్నట్లు సమాచారం. అయితే స్కీం జాబితాకు పంచాయితీ లెక్కలకు పొంతన లేదని,మా పంచాయితీ ద్వారానే రక్షిత నీటిని అందించే ట్యాప్ లు 200 పైగా ఉన్నాయని ఇ.ఓ హరిక్రిష్ణ తెలిపారు.
Spread the love