మున్సిపల్ కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి

– మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్
– ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్కు వినతి 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
మున్సిపల్ కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి.. అని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్కు గురువారం వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గండి వెంకట్ మాట్లాడుతూ.. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్1936 ప్రకారం ఔట్ సోర్సింగ్ కార్మికులకు ప్రతినెల 5వ తారీకు వేతనాలు చెల్లించాలి అన్ని డిమాండ్ చేశారు. కానీ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ శ్రీ కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీ  కాంట్రాక్టర్ శరత్ ప్రతినెల వేత్రనాలు సకాలంలో చెల్లించక పోవడంతో కార్మికులు వారి కుటుంబాలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురైతున్నారు అని అన్నారు. కావున నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ల ఇంజనీరింగ్ సెక్షన్, శానిటేషన్ డ్రైవర్స్, స్ట్రీట్ట్స్ లైట్ గార్డెన్స్, వాటర్ సప్లయ్ తదితర సెక్షన్లలో 680 మంది కార్మికులు శ్రీ కార్తికేయ  ఏజెన్సీ ద్వారా పని చేస్తున్నారు. కావున వీరికి ప్రతినెల 5వ తేదీ న గతంలో లాగే వారికి వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అనంతరం సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, రాహుల్, హరీష్, మురళి, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.
Spread the love