మునుగోడు గడ్డ రాజగోపాల్ రెడ్డి అడ్డ అనే విధంగా తీర్పు ఉండాలి..

– రాజగోపాల్ రెడ్డి రాజనామంతో నియోజకవర్గ అభివృద్ధికి 560 కోట్లు మంజూరు అయినవి..
– ఆపదలో ఆదుకునే రాజగోపాల్ రెడ్డిని ఆశీర్వదించండి..
నవతెలంగాణ- మునుగోడు: రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి కెసిఆర్ అరాచక పాలనను అంతం చేసేందుకు యుద్ధం ప్రకటిస్తే వంద మంది ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి ప్రచారం చేసి ప్రజల్ని ప్రలోభ పెట్టిన మునుగోడు నియోజకవర్గం లోని  ప్రజలు రాజగోపాల్ రెడ్డి మీద ఉన్న నమ్మకంతో  87 వేల ఓట్లు వేశారంటే ఈ ఎన్నికలలో మునుగోడు గడ్డ రాజగోపాల్ రెడ్డి అడ్డా అనే విధంగా అత్యధిక మెజార్టీ గెలుపొందే విధంగా మునుగోడు ప్రజలు తీర్పు ఇవ్వాలని తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి కోరారు .గురువారం మండలంలోని చల్మెడ , కొంపెల్లి , చీకటిమామిడి , మునుగోడు లో గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై ప్రచార నిర్వహించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి 560 కోట్ల నిధులు వచ్చినది వాస్తవం కాదా అని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి అండగా ఉండేందుకు అర్ధరాత్రి ఆపద వచ్చిన ఆదుకునే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి మంచి మనిషిని గెలిపించుకుంటే నియోజవర్గంలోని ప్రజలకు మరింత సేవ చేస్తారని అన్నారు. కరోనా కష్టకాలంలో అందరి కుటుంబాలలో అండగా నిలిచిన మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. నియోజవర్గ అభివృద్ధి కోసం గెలిపిస్తే మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే అంత గొప్ప మనస్తత్వం కలవాడని  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేయి గుర్తు పై ఓటేసి  భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నారబోయిన స్వరూప రాణి రవి ముదిరాజ్, వైస్ ఎంపీపీ అనంత వీణ స్వామి గౌడ్, డిసిసిబి డైరెక్టర్, మునుగోడు పిఎసిఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు వేమిరెడ్డి జితేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, సర్పంచులు జాల వెంకన్న యాదవ్, తాటికొండ సంతోష  సైదులు, జక్కల శ్రీను యాదవ్, మాజీ సర్పంచ్ పాలకూరి యాదయ్య, అన్వర్, జిట్టగొని సైదులు, అమర్ పటేల్,  కాంగ్రెస్, సిపిఐ జిల్లా మండల నాయకులు తదితరులు ఉన్నారు.
Spread the love