టీజేకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులుగా మూర్తుజా

నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ జానపద కళాకారుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా ఉపాధ్యక్షులు గా అశ్వారావుపేట కు చెందిన ఎండి మూర్తుజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం అయిన  కొత్తగూడెంలో జరిగిన ఆ సంఘం సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో జిల్లా, డివిజన్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. అశ్వారావుపేట కు చెందిన సీనియర్ కళాకారుడు మూర్తుజా ను అశ్వారావుపేట నియోజక వర్గం అధ్యక్షుడిగా నూ ఎన్నుకున్నారు. అనంతరం సంఘం బాధ్యులు, తోటి కళాకారులు అందరు కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందించారు.
Spread the love