– పాలసీబజార్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ హెడ్ సమీప్ సింగ్
నవతెలంగాణ – హైదరాబాద్: రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం లక్ష్యంగా ‘పెన్షన్ ప్లాన్’ ఉండాలని పాలసీ బజార్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ హెడ్ సమీప్ సింగ్ తెలిపారు. రిటైర్మెంట్ ప్రణాళికకు ఒక నిర్మాణాత్మక విధానాన్ని అందించాలన్నారు. ఇది వ్యక్తులు కాలక్రమేణా గణనీయమైన మూలధనాన్ని నిర్మించుకోవడానికి వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. మార్కెట్‌కు అనుసంధానమైన పెన్షన్ ప్లాన్లలో 15 శాతం సంవత్సరిక వృద్ధి రేటుతో పెట్టుబడి పెడితే 20 సంవత్సరాల్లో సుమారు రూ. 5.32 కోట్లు సమీకరించుకోవచ్చని తెలిపారు. ఈ ప్లాన్ల ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, మొత్తానికి సంబంధం లేకుండా 60 శాతం నిధులను పన్ను మినహాయింపుతో ఉపసంహరించుకోవచ్చని పేర్కొన్నారు. మిగతా మొత్తాన్ని తప్పనిసరిగా అన్యూటీగా పెట్టుబడి పెట్టాలన్నారు. తద్వారా రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం పొందవచ్చన్నారు.
మార్కెట్‌కు అనుసంధానమైన పెన్షన్ ప్లాన్లు ఆర్థిక భవిష్యత్తు నిర్మించడానికి సమర్థవంతమైన మార్గాన్ని అందిస్తాయన్నారు. క్రమంగా పెట్టుబడి పెడితే కంపౌండింగ్ ప్రయోజనాన్ని అందిపుచ్చుకొని గొప్ప సంపదను సృష్టించుకోవచ్చని తెలిపారు. పెన్షన్ ప్లాన్‌లో నిర్దిష్ట కాలం పాటు నిధులు పెట్టాలన్నారు. ఈ పెట్టుబడులు ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల ద్వారా వృద్ధి చెంది, కంపౌండింగ్ ప్రయోజనం పొందుతాయన్నారు. గడువు ముగిసిన తర్వాత పెట్టుబడిదారుడు నిధిలో ఒక భాగాన్ని పన్ను మినహాయింపుతో ఉపసంహరించుకోవచ్చని తెలిపారు. మిగతా మొత్తం అన్యూటీగా మార్చడం తప్పనిసరి అన్నారు. పాలసీబజార్ లెక్కల ప్రకారం 15 శాతం చక్రవడ్డీ వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) ఉంటే.. రూ.10,000 నెలసరి పెట్టుబడి 20 సంవత్సరాల్లో రూ.1.06 కోట్లు వరకు పెరుగుతుందని తెలిపారు. ఇందులో రూ.63.6 లక్షలు పన్ను మినహాయింపుతో ఉపసంహరించుకోవచ్చని పేర్కొన్నారు. రూ.50,000 నెలసరి పెట్టుబడి రూ.5.32 కోట్లు వరకు పెరిగి రూ.3.19 కోట్లు పన్ను మినహాయింపుతో ఉపసంహరించుకోవచ్చని తెలిపారు.
ప్రారంభం నుంచే స్థిరంగా పెట్టుబడి పెట్టడం ఎంతో ముఖ్యమన్నారు. పెట్టుబడిదారులు 60 శాతం మొత్తం పన్ను రహితంగా ఉపసంహరించుకోగలరని తెలిపారు. మిగిలిన 40 శాతం అన్యూయిటీలో పెట్టుబడి పెట్టడం ద్వారా రిటైర్మెంట్ తర్వాత జీవితాంతం స్థిరమైన ఆదాయం పొందవచ్చన్నారు. పెన్షన్ ప్లాన్ల రాబడులు మార్కెట్ పని తీరుపై ఆధారపడి ఉంటాయన్నారు. అందువల్ల అవి అనిశ్చితంగా ఉంటాయని తెలిపారు. 15 శాతం సీఏజీఆర్ కేవలం అంచనా మాత్రమేనని, కానీ నిజమైన రాబడులు తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిధులు పాలసీ కాలపరిమితి వరకు లాక్ అయి ఉంటాయన్నారు. అందువల్ల అత్యవసర పరిస్థితుల్లో మూలధనాన్ని ఉపసంహరించుకోవడం కష్టం అన్నారు. 60 శాతం మొత్తం పన్ను మినహాయింపు కలిగినప్పటికి, మిగిలిన 40 శాతం అన్యూయిటీ ద్వారా వచ్చే ఆదాయంపై పెట్టుబడిదారుని ఆదాయపు పన్ను స్లాబ్‌కు అనుగుణంగా పన్ను వర్తిస్తుందన్నారు. పెన్షన్ ప్లాన్లు రిటైర్మెంట్ కోసం క్రమశిక్షణతో పొదుపు చేయడానికి మార్గాన్ని అందిస్తాయన్నారు. జీవన వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక నిపుణులు కంపౌండింగ్ ప్రయోజనాన్ని పూర్తిగా పొందేందుకు ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిదన్నారు.