వ్యక్తిగత పరిశుభ్రత కలిగి ఉండాలి..

నవతెలంగాణ- భిక్కనూర్
ప్రతి ఒక్క విద్యార్థినీలకు కిశోర బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం మండలంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే పాఠశాలలో సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్ట ముఖ్య సలహాదారుడు డాక్టర్ పుట్ట మల్లికార్జున్, ఎం ఏ సలీం, మండల వైద్యాధికారి యెమీమా, ప్రిన్సిపల్ మనీ దీప్తి, ఆశా కార్యకర్తలు, పాఠశాల అధ్యాపకులు, పాఠశాల విద్యార్థినీలు పాల్గొన్నారు.
Spread the love