అవతరణ వేడుకలకు ముస్తాబు

– విద్యుత్ దీపాల అలంకరణలో ప్రభుత్వ కార్యాలయాలు

– రేపు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న కలెక్టర్ హరి చందన 

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు ముస్తాబయ్యాయి. జిల్లా కలెక్టరేట్ తో పాటు అన్ని కార్యాలయాలు విద్యుత్ దీపాలతో అలంకరించగా  ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాగా జిల్లా కలెక్టర్ హరిచందన  దాసరి  ఆదేశానుసారం అధికారులు అవతరణ దినోత్సవానికి కావలసిన అన్ని ఏర్పాట్లను శనివారమే పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో  భాగంగా జిల్లా కలెక్టర్  హరిచందన దాసరి  రేపు ఉదయం 8.45 గంటలకు  అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం 9 గంటలకు పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
Spread the love