– 11 నెలల కనిష్టానికి ఈక్విటీ ఎంఎఫ్‌లు
– మార్చిలో 14 శాతం తగ్గుదల
న్యూఢిల్లీ : స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అస్థిరత మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై తీవ్రంగా పడుతోంది. అమెరికా టారిఫ్‌ల దెబ్బకు తీవ్ర ప్రతికూలతను ఎదు ర్కొంటున్న నేపథ్యంలో మార్కెట్ల లో ఈ ఏడాది మార్చిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులు రూ.25,082 కోట్లకు తగ్గాయి. ఇది 11 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఇంతక్రితం ఫిబ్రవరి ఎంఎఫ్ పెట్టుబడుల్లోనూ 14 శాతం పతనం చోటుచేసుకుంది. మరోవైపు గడిచిన మార్చిలో క్రమబద్దమైన పెట్టుబడులు ఎస్‌ఐపీలు రూ.25,925 కోట్లకు తగ్గి.. నాలుగు నెలల కనిష్టానికి పడిపోయాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచు వల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్‌ఐ) గణంకాల ప్రకారం.. గడిచిన మార్చిలో ఈక్విటీ ఆధారిత ఎంఎఫ్‌ల్లో రూ.25,082 కోట్ల పెట్టుబడులు చోటుచేసుకున్నాయి. ఇంతక్రితం ఫిబ్రవరి నెలలో రూ.29,303 కోట్లుగా నమో దయ్యాయి. ఏప్రిల్ 2024లో రూ.18,912 కోట్ల ఈక్విటీ ఎంఎఫ్‌లు చోటు చేసుకోగా.. ఆ తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి.
”గతంలో బలమైన లావాదేవీలు చూసిన రంగాల్లో ఇటీవల పెట్టుబడులు భారీగా తగ్గడం వల్ల ఈ మంద గమనం ఎక్కువగా చోటు చేసుకుంది” అని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ మేనేజర్ రీసెర్చ్ నేహల్ మెష్రామ్ పేర్కొన్నారు. ముఖ్యం గా లార్జ్ క్యాప్ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు భారీగా తగ్గాయి. ఈ విభాగంలో గడిచిన మార్చిలో రూ.2,479 కోట్లు పెట్టుబడులు మాత్రమే నమోదయ్యాయి. ఫిబ్ర వరిలో రూ.2,866 కోట్ల పెట్టు బడులు చోటుచేసుకున్నాయి. పెట్టుబడిదారులు అనిశ్చితిని ఇష్టపడరని.. అందుకే ఎంఎఫ్ పెట్టుబడుల్లో తగ్గుదల చోటు చేసుకుందని యూనియన్ ఏఎంసీ సీఈఓ మధు నాయర్ పేర్కొన్నారు. పెట్టుబడుల్లో తగ్గుదల చోటుచేసుకున్నప్ప టికీ మార్చిలో ఎంఎఫ్ పరిశ్రమ అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం) 65.7 లక్షల కోట్లకు చేరింది. ఇంతక్రితం నెలలో ఇది రూ.64.53 లక్షల కోట్లుగా ఉంది.
రూ.31,575 కోట్ల ఎఫ్‌ఐఐల విక్రయం
ప్రస్తుత ఏప్రిల్‌లో ఇప్పటి వరకు భారత స్టాక్ మార్కెట్ల నుంచి రూ.31,575 కోట్ల విలువ చేసే విదేశీ సంస్థాగత పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ)లు తరలిపోయాయి. ఇంతక్రితం మార్చిలో రూ.3,973 కోట్లు, ఫిబ్రవరిలో రూ.34,574 కోట్లు, జనవరిలో రూ.78,027 కోట్లు చొప్పున ఎఫ్‌ఐఐలు వెనక్కి వెళ్లిపోయాయి. గతేడాది అక్టోబర్ అత్యధికంగా రూ.94,017 కోట్లు, ఈ ఏడాది జనవరిలో రూ.78,027 కోట్ల చొప్పున ఎఫ్‌ఐఐలు తరలిపోవడంతో మార్కెట్లలోనూ తీవ్ర ఒత్తిడి నెలకొంది.