Thursday, June 25, 2026
E-PAPER
Homeక్రైమ్వీడిన నల్లగొండ కుటుంబ హత్య కేసు మిస్టరీ

వీడిన నల్లగొండ కుటుంబ హత్య కేసు మిస్టరీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: నల్లగొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.ఈ కేసులో మృతులుగా గుర్తించిన వారిలో భార్యాభర్తలు సుల్తాన్(45), హసీనా(40), కొడుకు ముజామిల్ (21), కూతురు అఫోరా (21) ఉన్నారు. మూడు రోజుల వరకు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి.

సుల్తాన్ నల్లగొండలోని ప్రకాశం బజారులో బ్యాగుల వ్యాపారం చేసేవారు. ఆయన భార్య హసీనా స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. . వీరి కుమారుడు ముజామిల్‌ ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె అఫోర ఇదే పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. సుల్తాన్‌ మొదటి భార్య మృతిచెందింది. హసీనాతో రెండో వివాహం కాగా ఇప్పుడున్న పిల్లలిద్దరూ సుల్తాన్‌ మొదటి భార్య పిల్లలని స్థానికులు తెలిపారు.

అయితే, నలుగురి హత్య కేసులో సుపారీ హత్య చేయించింది హసీనా మొదటి భర్త కూతురు బుషా బుటానీనే అని పోలీసుల దర్యాప్తులో తేలింది. 150 గజాల ప్లాట్, బంగారం కోసమే బుషా బుటానీనే ఈ హత్యలు చేయించింది. హైదరాబాద్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ని బుషా బుటానీ ప్రేమ వివాహం చేసుకుంది. పాతబస్తీ రౌడీ షీటర్స్‌కి లక్షల రూపాయల సుపారీనీ కూతురు బుషా బుటానీ ఇచ్చింది. ఈ హత్యలకు కారణమైన ఆరుగురు రౌడీ షీటర్స్, హసీనా కూతురు, అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులంతా హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్లుగా గుర్తించారు. అయితే హత్యలకు దారితీసిన అసలు కారణాలు, సుఫారీ వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తులు, నిందితుల పాత్రపై పోలీసులు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -