Thursday, June 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రకియ ప్రారంభం

జుక్కల్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రకియ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
ఎస్ఐఆర్ ప్రక్రియ జుక్కల్ నియోజకవర్గంలో గురువారం 255 పోలీంగ్ బూత్ లలో ప్రారంభమైందని మద్నూర్ తహశీల్దార్ ఎండీ ముజీబ్ తెలిపారు. అర్హులైన వారిని ఓటర్ల జాబితాల్లో చేర్చి, అనర్హుల పేర్లను జాబితా నుంచి తొటగించడమే దీని ప్రధాన ఉద్ధేశమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఈ ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతుందని చెప్పారు. ఓటర్ జాబితా నమోదు ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్యూమరేట్లరకు, గ్రామ కార్యదర్శులతో పాటు ప్రజలు సహకరించాలని సూచించారు.

అదేవిధంగా మద్నూర్ మండల పరిధిలోని చిన్న షక్కర్గ సర్పంచ్ దిగంబరావ్, కార్యదర్శి ప్రణయ్ కుమార్ లు గ్రామ పెద్దలు పాండురంగ పటేల్, గ్రామస్తులతో పాటు గురువారం ఎస్ఐఆర్ ప్రకియను ప్రారంభించారు. గ్రామ బిఎల్ఓ గుండా నర్సింలు ఎస్ఐఆర్ గురించి గ్రామస్తులకు అవగాహన చేశారు. కార్యక్రమంలో ఆర్ఐ మురళిధర్, వివిధ పార్టీల నాయకులు బి ఎల్ ఓ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -