Thursday, June 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే

జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రైవేట్ కాలేజీల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి.. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 9 లోని మార్గదర్శకాలపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఈ ఆదేశాలు వచ్చే మంగళవారం వరకు అమల్లో ఉంటాయని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం స్పష్టం చేసింది.కోట్లాది రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకుండా, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దంటూ ఆంక్షలు విధించడంపై న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడమే కాకుండా, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయరాదన్న ప్రభుత్వ నిబంధనలను సవాలు చేస్తూ 89 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.

ప్రభుత్వం తరఫున స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ బకాయిల చెల్లింపుపై వివరణ ఇచ్చారు. ఈ రీయింబర్స్‌మెంట్‌ పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నిధుల్లో కేంద్రం వాటా ఉంటుంది. అయితే, ముందుగా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి నిధులు చెల్లించాలని, ఆ తర్వాతే తమ వాటా విడుదల చేస్తామని కేంద్రం చెబుతోందని వివరించారు. దీనివల్ల మొత్తం బకాయిల భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడిందని, వేల కోట్ల రూపాయల బకాయిలు ఉండటం వల్లే కొంత ఆలస్యం జరుగుతోందని కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి రెండు వారాల సమయం కావాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -