Thursday, June 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వర్షాల కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం

వర్షాల కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో స్థానిక గ్రామ అభివృద్ధి  కమిటీ ఆధ్వర్యంలో గురువారం వర్షాలు కురవాలని వేడుకుంటూ రైతులు, ప్రజలు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు నిర్వహించారు. విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు జలకళ సంతరించుకోవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, పిల్లాపాపలతో సుఖంగా ఉండాలని నీళ్ల బిందెలు ఎత్తుకొని ఆలయాలకు చేరుకుని విగ్రహాలకు జలాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్యాల సుభాష్ గౌడ్ మాట్లాడుతూ వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో దైవ కృప కోసం అందరూ కలిసి పూజలు నిర్వహించామని, వానదేవుడు తమ ప్రార్థనలు ఆలకించి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, కుల సంఘాల సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -