మఠం ఉత్తరాధికారిగా నాగేశ్వర్ మన్మథ్ స్వామి

నవతెలంగాణ  – జుక్కల్
జుక్కల్ మండలం కౌలాస్ మహంతేశ్వర మఠం సంస్థాన పీఠానికి ఉత్తరాధికారిగా నాగేశ్వర మన్మధ స్వామి నియామకమయ్యారు. గురువారం మఠంలో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుత మఠాధిపతి శ.బ్ర.శ్రీ మల్లికార్జున స్వామి మహారాజ్ ఆధ్వర్యంలో నూతన ఉత్తరాధికారి నియామకం జరిగింది. కౌలాస్ వృషభలింగ శివాచార్య మఠాధిపతి బసవలింగ శివాచార్య మహారాజ్, హానేగామ్ పీఠాధిపతి శంకర లింగ శివాచార్య మహారాజ్ ,ఖత్ గావ్ పీఠాధిపతి మల్లికార్జున శివాచార్య మహారాజ్ , గుడిమెట్ మహారాజ్ మహాదేవ స్వామి ల ఆధ్వర్యంలో ఉత్తరాధికారిగా  అయ్యవారి నియామక ఏర్పాటు తంతు ఘనంగా నిర్వహించారు. మహారాష్ట్రలోని సోనారి గ్రామానికి చెందిన నాగేశ్వర్ మన్మథ్ స్వామినీ కౌలాస్ మఠానికి పీఠాధిపతిగా చేసేందుకు మొదటి తంతుగా ఉత్తరాధికారి గా నియామకం పూజా కార్యక్రమాలతో లింగానికి ఉత్తరాధికారికి  పెళ్లి తంతు జరిపి మఠానికి కాబోయే పీఠాధిపతిగా గుర్తించారు. ఈ కార్యక్రమంలో కౌలాస్ వీరశైవ లింగాయత్ సమాజ్ నాయకులు వీరేశ్ పటేల్ ,ప్రకాష్ పటేల్, వినయ్ పటేల్, మల్లికార్జున అప్ప, బాబయప్ప, కాశప్ప, బోడ సాయిలు, తదితరులు భక్తులు శిష్యులు పాల్గొన్నారు.

Spread the love