దళారుల పాలవుతున్న నల్లరేగడి..

దళారుల పాలవుతున్న నల్లరేగడి..– ప్రభుత్వ ఆదాయానికి గండి
– చోద్యం చూస్తున్న అధికారులు
నవతెలంగాణ-తొర్రూర్‌ రూరల్‌
గ్రామాల్లోని ఊర చెరువుల్లో నల్లరేగడి మట్టి దళారుల పాలవుతోంది.. సారవంతమైన నల్లరేగడి మట్టిని రైతులు తమ పంట పొలాల్లో తోలుకోవాలన్న భవిష్యత్తులో దొరకకుండా పోతుంది. నల్లరేగడి మట్టిని ఎటువంటి అనుమతులు లేకుండా ఇటుక బట్టి యజమానులు మండలంలోని నాంచారి మడూరు వజ్జరికుంట నుండి జెసిబి ట్రాక్టర్లతో గ్రామంలో గుట్టలు గుట్టలుగా నల్లరేగడి మట్టిని ఇటుక బట్టీల కోసం తోలుకుంటున్నారు.రాగడిమట్టిని సారవంతమైన నేల కోసం వ్యవసాయ వ్యవసాయ దిగుబడి కోసం ఉపాధి హామీ పథకం క్రింద రైతులను వినియోగించుకోమంది కాని ఈ దళారుల ఇటుక బట్టీలకు సారవంతమైపోయింది. ఇల్లుకు పునాది అయిపోతుంది. చెరువు భూమి లోనుండి తీసుకపోతున్నటువంటి వైనం అయినా రెవిన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు.. అధికారులకు ఏమైనా ముడుపులు చెల్లాయా .? లేక అధికార పార్టీ అండదండలు ఉన్నాయా..? నిత్యం వ్యాపార దందా ఇటిక బట్టీలకు నడుస్తూనే ఉంది. దాంతోపాటు ఖమ్మం టూ వరంగల్‌ జాతీయ రహదారిపై ఈ ఇటుక బట్టీలు ఉండడంవల్ల వచ్చిపోయే వాహనదారులకు కళ్ళల్లో దుమ్ము దూళి పడడంతో యాక్సిడెంట్లు అవుతున్నాయి. వెలికట్ట నుంచి నాంచారి మడూరు వరకు ఇబ్బంది పడుతున్నారు. యాక్సిడెంట్లతో వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు .. చెరువులో కెళ్ళి ఎక్కడైతే మంచి మట్టి రాగడి ఉంటదో ఆ యజమాని దగ్గరుండి తీయించుకొని వెళుతున్న పరిస్థితి. తక్షణమే మైనింగ్‌, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Spread the love