కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కో-ఆర్డినేటర్ గా నాంపల్లి నరసింహ

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
నల్లగొండ పార్లమెంట్ లీగల్ సెల్ కో-ఆర్డినేటర్ గా న్యాయవాది నాంపల్లి నరసింహ నియమితులయ్యారు.కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ అశోక్ గౌడ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నల్లగొండ పార్లమెంట్ లీగల్ సెల్ కో-ఆర్డినేటర్ గా నియమితులైన నాంపల్లి నరసింహ ఆదివారం పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుప రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లీగల్ సెల్ కన్వీనర్ గా తన నియమకానికి కృషి చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర చైర్మన్ పోన్నం అశోక్ గౌడ్, న్యాయవాది లింగంపల్లి శ్రీనుకు కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love