సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన నారబోయిన రవి

– భువనగిరి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం..
నవతెలంగాణ – మునుగోడు
భువనగిరి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయడమే లక్ష్యంగా బుధవారం హైదరబాద్ లోని ఎమ్మేల్యే రాజ్ గోపాల్ రెడ్డి నివాసంలో భవనగిరి పార్లమెంట్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్  పుష్పగుచ్చం అందించి  సాల్వతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి కార్యకర్త కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోను గడపగడపకు చేరే విధంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 ఎంపి స్థానాలకు 17 స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థుల గెలవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుదలతో   భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు లక్షల మెజార్టీతో గెలవబోతున్నారని తెలిపారు . ఆయన వెంట , జిల్లా నాయకులు వేమిరెడ్డి జితేందర్ రెడ్డి , మునుగోడు వైస్ ఎంపీపీ అనంత వీణ స్వామి గౌడ్ తదితరులు ఉన్నారు.
Spread the love