
హలియా మున్సిపాలిటీ చెందిన గొట్టిముక్కల నరేష్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్ సర్టిఫైడ్ ట్రైనర్ అవార్డు అందుకున్నారు.ఆదివారం నల్గొండనీ లీఫ్ హోటల్ లో జరిగిన ముగింపు శిక్షణ కార్యక్రమంలో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వరరావు ఆదేశాలతో ఈ అవార్డును ప్రముఖ రచయిత బెల్లి యాదయ్య మరియు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నూనె సుదర్శన్, రీజినల్ సెక్రటరీ కోట్ల సాయి కిరణ్ చేతుల మీదుగా పంపిణీ అవార్డు ప్రదానం చేశారు. నెల రోజులు శిక్షణలో మోటివేషనల్ స్పీకర్ గా ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అనేటటువంటి మెలకువలు నైపుణ్యపు శిక్షణ తరగతులు నిర్వహించారు అనంతరం . ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతు నేటి సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలన్న బాధ్యతతో ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ లో బాధ్యతలు తీసుకొని సమాజానికి సేవ చేయడమే లక్ష్యంగా పనిజెస్తా అన్నారు. తనలాగే ఇంకా ఎంతోమంది ట్రైనర్లుగా తయారయ్యి సమాజంలో మార్పుని తీసుకురావాలని కోరారు. ఇంటికి ఒక ట్రైనర్ ఊరికి ఒక స్పీకర్ అనే నినాదంతో ఈ కార్యక్రమం ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఇంపాక్ట్ మెంటర్లు, స్పీకర్స్ ట్రైనర్స్ వీరెల్లి శ్రీలత,హర్షిత, అంజిరెడ్డి, పృద్వి, రవి, పాల్గొన్నారు.