
నవతెలంగాణ – కంఠేశ్వర్
మహిళలు ఇంటికి పరిమితం కాకుండా అన్ని రంగాలలో రాణించాలి. మహిళ అంటే ఒక కుటుంబానికి సెక్యూరిటీ. కుటుంబం బాగుండాలని కోరుకునేవారు. మానసికంగా సపోర్టు చేయాలి. తల్లిని పిల్లలు గౌరవించాలి. ప్రతి దాంట్లో చిన్న పిల్లలు, మహిళలపై ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. చిన్ననాటి నుండే పిల్లలకు మహిళల చట్టాలపై అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు పిల్లలకు హద్దులను నేర్పించాలి. మంచి చెడు చెప్పాలి. పనిచేయడం నేర్పించాలి. మహిళలకు స్వయంకృషి ఉండాలన్నారు.మహిళల రక్షణకు కేవలం చట్టాలే సరిపోవని అభిప్రాయపడ్డారు. మహిళల పట్ల కుటుంబ వ్యవస్థలోనే మార్పులు జరగాలని అన్నారు. స్వయంకషితో ప్రస్తుత సమాజంలో ఎదగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకని గుణంగా ప్రభుత్వం సైతం స్వయంకృషిగా ఎదిగేందుకు మహిళలకు అన్ని విధాల కృషి చేస్తుంది. తల్లిదండ్రులు చిన్నతనం నుండే చిన్నపిల్లలు బాలుడైన, బాలిక అయిన ఇద్దరినీ ఒకేలా చూడాలి. వారిద్దరి మధ్య వ్యత్యాసం చూపడం వల్లే ఇంట్లో నుండి బయటకు వెళ్లిన బాలురు కూడా బయటవారితో అలాగే ప్రవర్తిస్తారు. కాబట్టి చిన్నతనం నుంచి మంచి అలవాట్లు మంచి గుణాలు నేర్పించాలి.